భర్తది కోసేసిన భార్య | Wife Chops off husbands Fingers for Asking to stop chatting
సోషల్ నెట్వర్క్ లు పాపులర్ అయిన దెగ్గర నుండి ఫేస్ బుక్ మరియు వాట్స్ అప్ లలో చాటింగ్ చేయడం అనేది బాగా పెరిగి పోయింది. సెల్ ఫోన్ ఉన్న వారైతే మరి ఎక్కువగా చాటింగ్ చేస్తున్నారు. ఎంతలా అంటే ఆ చాటింగ్ అనేది లేకపోతే జీవించలేము అనే స్థాయిలో అంతగా ఈ చాటింగ్ కి బానిసలూ ఐపోతున్నారు. వారు చాటింగ్ చేస్తూ తమ
చుట్టూ పక్కల ఏం జరుగుతుంది అనే విషయాన్నీ కూడా పట్టించు కొవట్లేదు. ఈ చాటింగ్ ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది. దీనికీ తాజాగా జరిగిన ఓ సంఘటననే ఉదాహరణగా చెప్పు కోవచ్చు. బెంగుళూరు HRS లేఔట్ లో టీచర్ గా పనిచేస్తున్న సునీత ఈ చాటింగ్ భూతానికి బానిసగా మారి తన భర్త పైనే దాడికి పాల్పడింది.
సునితా సింగ్ ఎప్పుడు చూసినా తన స్నేహితులతో చాటింగ్ చేస్తూ ఉండటంతో విసుగు చెందిన ఆమె భర్త చంద్రకాంత్ ఆమెను చాటింగ్ మానేయమని ఎన్నో సార్లు చెప్పాడట. కాని సునీతా సింగ్ భర్త మాటలను వినిపించుకోలేదు. అలాగే తన చాటింగ్ ని కంటిన్యూ చేసింది. ఇలా తరచు జరుగుతుండంతో భర్తకు అనుమానం వచ్చింది. తన భార్య ఎవరితో చాటింగ్ చేస్తుందా అని ఆమె సెల్ ఫోన్ లోని మెసేజ్ లు చూసి షాక్ అయ్యాడు. తన ఫోన్ ను చెక్ చేయడం చూసిన సునితా భర్త తో గొడవకు దిగింది. కోపంతో ఊగిపోయిన ఆమె కిచెన్ లో ఉన్న చాకు తీసుకొని తన భర్త చేతి వెళ్ళు కోసేసింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో చంద్రకాంత్ షాక్ కి గురి అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. తన భార్య చేసిన ఈ ఘనకార్యంపై చంద్రకాంత్ దెగ్గరున్న పోలిస్ స్టేషన్ కి వెళ్ళాడు. పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసారు. చూసారా ఈ చాటింగ్ భూతం ఈ ఇద్దరి దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. రెండు జీవితాలు నాశనం అవ్వడానికి కారణం అయ్యింది. టెక్నాలజీని అవసరం మేరకు వాడుకుంటే తప్పులేదు. ఏదైనా మితి మీరితే దారుణాలు జరుగుతాయని మన పెద్దలు ఏనాడో చెప్పారు కదా..

Post a Comment