ఆకాశంలో రైలు మార్గం ఉంది తెలుసా ? | Train to the Clouds


సహజంగా రైలు మార్గం అనేది నెల పైన ఉంటుంది కదా.. ఆకాశంలో రైలు మార్గం ఏంటి అని అనుకుంటున్నారా ? .. ఐతే మీకు "ట్రైన్ టు ది క్లౌడ్స్" గురించి తెలియదు అన్న మాట. ఇది అర్జెంటినా దేశం సల్జా నగరం నుంచి లా పోర్వోలిల్లా అనే ప్రదేశానికి వెళ్ళే రైలు మిమ్మల్ని మేఘాల్లోకి తీసుకెళ్తుంది. సముద్ర మట్టానికి 4 వేల మీటర్ల ఎత్తున 
తీసుకువెళ్ళే ఈ రైలునే  " ట్రైన్ టు ది క్లౌడ్స్" అని పిలుస్తారు. ప్రపంచంలో 
ఎత్తయిన రైలు మార్గం ఇదేనట!  చూడముచ్చటైన వంతెనలు, గుహల్లోంచి ఈ రైలు 
దాదాపు 217 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. 4200 మీటర్ల ( 4 కిలో మీటర్ల ) 
ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో మేఘాలు, స్వచ్చమైన గాలి, కాలుష్యం లేని చల్లటి వాతావరణం ఉంటుందట. పర్యాటకులు అక్కడ దిగి కాసేపు మేఘాల ఉనికిని, గాలిని, చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించి, ఫోటోలు తీసుకుని అదే రైలులో బయలు దేరిన చోటుకు తిరిగి వెళతారు. ఒకప్పుడు రవాణా కోసం నిర్మించిన రైలు మార్గం ఇప్పుడిలా పర్యాటక కేంద్రం గా మారి సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందిస్తోంది. బాగుంది కదా .. ఐతే మీరు ఒకసారి వెళ్లి ఆ చల్లటి వాతావరణాన్ని గాలిని ఆస్వాదించండి.



#TraintotheClouds #TraininClouds #Train #Arjentina #SaljaCity #TrainRoute #WorldFamous #News #Famous #WorldNews #NewTrendingNews