కోరిక తీర్చలేదని యువకుడిపై యాసిడ్ దాడి చేసిన 45 ఏళ్ళ మహిళ | 45 Old Women Acid Attack on young man
45 ఏళ్ళ మహిళ ఒక యువకుడిపై యాసిడ్ దాడి చేసింది అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో వైశాలిలో సోమవారం జరిగింది. తన కోరికను కాదన్నాడు అనే కారణంతో ఓ మధ్య వయసు మహిళ స్థానిక ఓ యువ డాక్టర్ పై యాసిడ్ దాడి చేయడం కలకలం రేపింది. ఇప్పుడు ఆ యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్సా పొందుతున్నాడు.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. అమిత్ వర్మ (28) అనే పశువుల డాక్టర్ పై ఓ మహిళ (45) సోమవారం నాలుగు లీటర్ల యాసిడ్ కుమ్మరించింది. అమిత్ వర్మతో సంబంధాన్ని కోరుకున్న మహిళ గత కొన్ని రోజులుగా అతన్ని వేధిస్తోంది. ఆమె కోరికను డాక్టర్ గట్టిగా తిరస్కరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. వెటర్నరీ డాక్టర్ అమిత్ కుక్కల కోసం స్థానికంగా ఒక క్లినిక్ నిర్వహిస్తున్నాడు. తీవ్ర గాయాలపాలైన అమిత్ ను అతని స్నేహితుడు దీపక్ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బాధితునికి నలభై శాతం పొట్టపైన, ఛాతిపైన తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు ప్రకటించారు. కాగ మహిళ పరారిలో ఉంది.
#AcidAttack #Acid #Love #LoveAffair #Affair #News #Trending #Shocking #ShockingNews #NationalMedia #Uttharapradhesh #ghajiyabad

Post a Comment