రూ. 888 లకే చౌక స్మార్ట్ ఫోన్! | Cheapest Android Smartphone in india for only Rs. 888/-
అప్పట్లో రింగింగ్ బెల్ సంస్థ రూ. 251 కే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను ఇస్తామంటూ పెద్ద దుమారమే లేపింది. తరువాత కుదరదు అని చెప్పేసింది. ఆ ఘటన మరవక ముందే ... జైపూర్ కు చెందిన డాకోస్ అనే సంస్థ తెరపైకి మరొక చౌక ఫోన్ ను తీసుక వొచ్చింది. ఈ కంపెనీ డాకోస్ X1 అనే ఫోన్ ను కేవలం రూ. 888 కే ఇస్తాం అంటూ ప్రకటించింది. ఈ సంస్థ తమ కంపెనీ మొదటి మోడల్ పేరును ' డాకోస్ ఎక్స్ 1 ' గా ప్రకటించిది. తన వెబ్ సైట్ ద్వారానే ఫోన్ లను అమ్మకానికి పెట్టింది. మే 2 లోగా ఫోన్ లను అందిస్తామని .. క్యాష్ అన్ డెలివరీ విధానం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది ఈ సంస్థ.
కొనుగోలుదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ బుక్ చేసుకోవాలని కోరుతూ వెబ్ సైట్లో వివరాలను పెట్టింది. అయితే, మొబైల్ ఎలా ఉంటింది అనే వివరాలు గానీ, ఫోన్ ఫీచర్స్ గానీ వెల్లడించలేదు. కొద్ది పాటి వివరాలను మాత్రమే అందుబాటులో ఉంచిన డాకోస్ సంస్థ.. సెల్ ఫోన్ కోనుగోలు కోసం కాల్ చేయొద్దని కేవలం ఎస్ఎంఎస్ మాత్రమే చేయాలని సోషల్ మీడియాలో ప్రకటించిది..
డాకోస్ సంస్థ మొదటి ఫోన్ ' డాకోస్ X1' ఫీచర్స్ ఇలా ఉన్నాయి ..
- 1 జీబి రామ్
- 2 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
- 4 అంగుళాల తెర
- 1.2 గిగా హెడ్జ్ ప్రాసెసర్
- 4 జీబీ ఇంటర్నల్ మెమొరీ
- 0.3 మెగా పిక్సెల్ ముందు కెమెరా
- ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్
#Android #Smartphone #Docos #DocosX1 #CheapestSmartphone #CheapestAndroidSmartphone #CheapSmartphoneinIndia #Smartphoneat888 #DocosSmartphone #NewTrendingNews #Trending #News

Post a Comment