బాహుబలి 2 లో జయదేవ రాణాగా ఎన్టీఆర్ .. | Jr Ntr in Bahubali 2 as Jayadeva Rana


బాహుబలి మొదటి పార్ట్ తో రికార్డు లు తిరగ రాసి జాతీయ అవార్డును అందుకున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇప్పుడు బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు బాహుబలి సెకండ్ పార్ట్ పై టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయ్. ఈ చిత్రంలో జక్కన్న ఆప్తమిత్రుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించానున్నడనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఈ చిత్రంలో నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ రాజమౌళి గారు వాటిని ఖండిచారు. కానీ ఎన్టీఆర్ నటించే విషయం మాత్రం ఖచ్చితమని, ఇందులో ఎన్టీఆర్ ఓ కీలకపాత్రలో కనిపిస్తాడని విశ్వసనీయవర్గాల సమాచారం.

బాహుబలి 2 లో ఒక ముఖ్య పాత్ర ఉందట. అది సినిమాకి చాలా కీలకం అని సమాచారం. ఆ పాత్ర పేరు జయదేవ రాణా. ఈ పాత్రను ఎవరైన ఫేమస్ హీరోలతో చేయించాలని అనుకుంటున్నారట. ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం తెలుగులో జయదేవ రాణా పాత్రను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయించాలని అనుకుంటున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. తమిళ్, హిందీ వెర్షన్ కోసం తమిళ్ స్టార్ హీరో సూర్య ఈ పాత్రలో నటింపజేయాలని భావిస్తున్నారట రాజమౌళి. ఇది ఓన్లీ గెస్ట్ రోల్ అయినప్పటికీ, ఈ పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగుతుందట. అందుకే స్టార్ హీరోలతో ఈ పాత్రను చేయించాలని అనుకుంటున్నారట జక్కన్న. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బాహుబలి 2 లో మనం ఎన్టీఆర్ ని జయదేవ రాణా గా చూడొచ్చు అన్నమాట. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నిజంగా పండగే ..

#JrNtr #Ntr #Tarak #JanataGarage #NtrMovie #bahubali #bahubali2 #Jakkanna #Prabhas #SSRajamouli #Anushka #RanaDaggubati #JayadevaRana #Bahubali2Shooting #Bahubali2Movie