ఆమెతో రొమాన్స్ డేంజర్? | Affair with her is Danger



బాలీవుడ్ జంట మలైకా అరోరా- అర్బాజ్ ఖాన్ లు విడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారని, అర్భాజ్ ఖాన్ తో మళ్ళి కలవడానికి మలైకా ఇష్టపడటం లేదని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. విరిద్దరిని కలపడానికి సల్మాన్ ఖాన్ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడట. అయితే అర్భాజ్ ఖాన్ తో విడిపోయాక బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ తో మలైకా అరోరా రహస్య రొమాన్స్ చేస్తోందంటూ రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. 


                            అర్జున్ కపూర్ - మలైకాలు అర్ధరాత్రి సమయంలో రహస్యంగా కలిసి, కాసేపు గడిపారని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై వీరిద్దరూ స్పందిచక పోవడంతో ఈ వార్తలు నిజమేనని బాలీవుడ్ జనాలు నమ్ముతున్నారు. ఐతే అర్జున్ కపూర్ తండ్రి బోని కపూర్ చాలా టెన్షన్ పడుతున్నాడట. మలైకా ఆరోరతో కలిసి రహస్య ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని రుజువైతే.. భవిష్యత్తులో సల్మాన్ ఖాన్ నుండి అర్జున్ కి ఇబ్బందులు తప్పవని .. అందుకే మరోసారి మలైకాతో తిరగవద్దంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. తండ్రి మాటలను సీరియస్ గా
తీసుకున్న అర్జున్ కపూర్ మళ్ళి మలైకాను కలిసే ప్రయత్నం చేయట్లేదట.. అది విషయం.. చూడాలి చివరికి ఏం జరుగుతుందో..


#ArjunKapoor #Sridevi #SalmanKhan #Arbaazkhan #MalaikaArora #ArbaazMalaika #LoveAffair #Breakup #Salman #Sulthaan #BoniKapoor #Bollywood #BollywoodAffairs #BollywoodGossips #Gossips #BollywoodMovies #Affair