మాంసం ఎక్కువగా తీసుకుంటున్నారా ? ఐతే కష్టమే ! | Meat is Not Good for Health
మనం తీసుకునే ఆహారంలో మాసం కూడా తప్పని సరిగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఐతే ఆ ఆహారంలో ఎక్కువగా మాసం (చికెన్, మటన్, బీఫ్) తీసుకుంటే అది హెల్త్ కి అంత మంచిది కాదు అని కూడా చెబుతున్నారు. కూరగాయలు, పండ్లు వంటి శాఖాహారం కాకుండా మాసం ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువ వయసున్నట్టు కనిపిస్తారట. అంతేకాకుండా త్వరగా ముసలి వారు అవుతారట. ఈ విషయం లండన్ లో గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సీసం ఫాస్పేట్ స్థాయిలు అధికమై వయసు పెరిగినట్టు కనిపిస్తారట. అలాగే మాంసాహారంలో ఉండే ఈ ఫాస్పేట్ ల వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయట. అందుకే మాంసాహారం తక్కువగాను, శాకాహారం ఎక్కువ గాను తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అది విషయం కాబట్టి మాంసాన్ని మీ ఆహారంలో తక్కువగా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
#Health #HealthTips #Food #Chicken #Mutton #HealthBenefits #Beef #Tips #FoodVarities #GoodHealth

Post a Comment