పవన్ తో సినిమా అస్సలు చెయ్యను | PVP says No Movie with Pawan Kalyan



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. ఆయనకు దేశ వ్యాప్తంగా
అభిమానులు వున్నారు. ఆయనకు ఉన్న క్రేజ్ చూసి ఆయనతో కలిసి కనీసం ఒక్క సినిమా ఐన చేయాలని చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తుంటారు. అయితే వీరందరికీ షాక్ ఇచ్చాడు ఓ స్టార్ ప్రొడ్యూసర్. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెప్పేసారు. పవన్ తో సినిమాకు నో అన్న ఆ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసుకోవాలని ఉందా ? 


                పివిపి బ్యానర్ పై పలు ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రసాద్ వి పోట్లురి. గతంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినపుడు ప్రసాద్ వి పోట్లురి ఆయన వెనక ఉండే అన్ని చూసుకున్నారు. అయితే వారి మధ్య వచ్చిన కొన్ని విభేదాలు దృష్ట్యా PVP పవన్ కు దూరమయ్యాడు. వీరి మధ్య దూరం ఎంతలా ఉంది అంటే.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో PVP గారిని పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడిగిన ప్రశ్నకు ఆయన నిర్మొహమాటంగా చేయను అని తెల్చిచేప్పేశారు. ఈ విషయం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు పవన్, పివిపి ఎందుకు విదిపోయరో, దానికి గల కారణాలను తెలుసు కోవాలని చూస్తున్నారు. 


#PVP #PVPCinemas #Pawan #PawanKalyan #PowerStar #TeluguCinema #TFI #Tollywood #Gossips #News #FilmyNews #Trending #Sardar #GabbarSingh #PawanNextMovie #PawanKalyanFans